ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతున్న సరే ఎన్నికల సంఘం మాత్రం ముందుకు అడుగులు వేస్తుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు సీఎం జగన్ కేంద్రానికి సమర్పించింది నివేదిక విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా తీవ్రతతో పాటుగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.

దీంతో సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వ ఉద్యోగులు కూడా కంగారుపడే పరిస్థితి ఉంది. స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ టీచర్లకు కరోనా సోకుతుంది. దీనితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం అర్థం చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

దీనికి సంబంధించి త్వరలోనే ఉద్యోగులందరూ ఒక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉద్యోగులు అందరి తరపున కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా చెప్పినట్లుగా సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే ముందు అడుగులో ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: