ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాష్ట్ర రాజకీయ పార్టీలు వాడి వేడి మాటలతో హీట్ పెంచుతున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారి పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అసదుద్దీన్ చేసిన నా వ్యాఖ్యలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి వారిరువురు ప్రతీకలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించదగ్గ గొప్పవారిని పేర్కొన్నారు. వారెవరో నాయకులకు మార్గదర్శకులు వారిని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారని గుర్తుచేశారు. నగరంలోని పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లను గురువారం బండి సంజయ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మహానేతలపై ఒవైసీ మాట్లాడిన తీరు బాధాకరం, మహా నేతల పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. ఎంఐఎం పార్టీ దేశ ద్రోహ పార్టీగా ముస్లీంలే భావిస్తున్నారు అటువంటి పార్టీని ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ స్కూల్ నుంచి వచ్చిన కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదు ప్రజలకు చెప్పాలి అన్నారు. టిఆర్ఎస్ ఎంఐఎం లు ఎన్నికల్లో కలిసి పనిచేయడం వల్ల కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు.రోహింగ్యాలను ప్రభుత్వం గుర్తించినట్లు భావిస్తున్నాం. ప్రశాంతంగా గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: