గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం  కోసం అన్ని పార్టీలు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం,. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. అగ్ర నేతలు కొందరు చేస్తున్న విమర్శలకు  మీడియా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు చుట్టి అభివృద్ధి అంటున్నారు అని మండిపడ్డారు.

ఒక్క స్తంభానికి ఎల్ఈడీ లైట్లు చుడితే పదిహేను వందల ఖర్చవుతుంది అని ఆయన అన్నారు. కానీ కాంట్రాక్టర్ 26 వేలు తీసుకుంటున్నడు  ... గింత అవినీతా  అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో వరదలొస్తే కేంద్ర మంత్రులు రాలేదంటుండు కేటీఆర్  ... కేటీఆర్ మరి వరదలొస్తే నువ్వైనాచ్చావా... మీ అయ్య వచ్చాడా అని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. మార్చిలో జరగాల్సిన ఎన్నికలను నవంబరులో పెట్టారు  అని మండిపడ్డారు.

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి... గెలిస్తే పది వేలు కాదు 25 వేలు వస్తయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వరద సాయం వద్దని బీజేపీ చెప్పలేదు అని ఆయన స్పష్టం చేసారు. బీజేపీ వాళ్లు అవినీతి చేయరు .. చేస్తే మా ఉద్యోగాలు ఉడతాయి  ... వీపులు పగులగొడతారు  అని ఆయన అన్నారు. అదే విధంగా మరిన్ని వ్యాఖ్యలు చేసారు.  టీఆర్ఎస్ పార్టీ మత రాజకీయాలు చేస్తోంది   అని ఆయన విమర్శించారు. ముస్లీంలు ఆలోచించాలి అని సూచించారు. అవినీతి టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క సారి బీజేపీకి ఓటేసి మాకు అవకాశం ఇవ్వండి  అని ఆయన ప్రజలను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: