ప్రస్తుతం భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందా. ఓవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిన శత్రు దేశాలకు ధీటుగా సమాధానం చెబుతూనే మరోవైపు.. భారత అభివృద్ధిని కూడా మరింతగా పెంచుకుంటూ భారత శక్తిని ప్రపంచదేశాలకు చాటిచెప్పే విధంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది భారత్. ఈ క్రమంలోనే స్వదేశీ ఆయుధ తయారీపై ఎక్కువగా దృష్టి పెట్టింది అన్న విషయం తెలిసిందే. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఎన్నో రకాల మిస్సైల్స్ కి  ప్రయోగాలు నిర్వహించి విజయవంతం అవుతుంది.



 అయితే ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వరుసగా మిస్సైల్స్  కి ప్రయోగాలు నిర్వహించి విజయవంతమై మిస్సైల్స్  ని భారత ఆర్మీలో చేర్చడంతో పాటు... మరోవైపు ఆయుధ విక్రయాలను కూడా భారత్ ప్రారంభించింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయుధ వ్యాపారంలో కూడా భారత్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా భారత రక్షణ పరిశోధన సంస్థ తయారు చేసిన బ్రహ్మోస్ మిస్సైల్స్  కొనుగోలు చేసేందుకు ఎన్నో దేశాలు ముందుకు వస్తున్నాయి  ఇప్పటికే ఫిలిప్పైన్స్ బ్రహ్మోస్  మిస్సైల్స్  కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.




 ఇక ఇప్పుడు మరో రెండు దేశాలు కూడా బ్రహ్మోస్  మిస్సైల్స్  కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. బ్రెజిల్ తో పాటు, చీలి  దేశం కూడా ప్రస్తుతం భారత రక్షణ రంగం పరిశోధన సంస్థ తయారు చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ముందుకు వచ్చింది. అయితే శత్రుదేశాల రాడార్ల  కు చిక్కకుండా  ఎంతో వేగంగా వెళ్లే టెక్నాలజీని అప్డేట్ చేస్తూ భారత రక్షణ పరిశోధన సంస్థ బ్రహ్మోస్ మిస్సైల్స్  ప్రయోగించింది.  ఇటీవల పలు దేశాల ప్రతినిధుల ముందు కూడా ఈ పరీక్షలు జరపగా విజయవంతమయ్యాయి. ఇలా ప్రస్తుతం ఆయుధ వ్యాపారంలో   కూడా దూసుకుపోతున్న భారత్ రానున్న రోజులు అగ్రగామిగా నిలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: