ఈటీవీ ప్లస్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో లో యాంకర్ గా చేసిన విష్ణు ప్రియ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఆ తర్వాత ఎన్నో ఈవెంట్లలో కూడా మెరిసి  తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయింది. ఇటీవలే చెక్ మేట్ అనే సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కాస్త సాంప్రదాయంగా కనిపించిన ఈ అమ్మడు చెక్ మేట్ అనే సినిమాలో మాత్రం హార్ట్ డోస్ విపరీతంగా పెంచేసింది.



 సాధారణంగా ఈ మధ్య కాలంలో రొమాంటిక్ డోస్ బాగాపెంచేసి  ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఎన్నో సినిమాలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య కాలంలో అయితే పాత్ర డిమాండ్ చేయాలి కానీ ఎలాంటి  సన్నివేశంలో నటించడానికి అయినా వెనకాడడం లేదు హీరోయిన్లు. ఇక ప్రస్తుతం యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇదే దారిలో నడిచింది. మొదటి సినిమాతోనే రొమాంటిక్ డోస్ పెంచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెల్లంపల్లి దర్శకనిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు.


 ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం రఘుబాబు షకలక శంకర్ లాంటి ఎంతో మంది పేరొందిన కమెడీయన్స్  కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది యాంకర్ విష్ణు ప్రియ. ఈ సినిమాలో తాను ఎంతో హాట్ హోల్ చేశా అంటూ చెప్పుకొచ్చింది.. 30 మంది చుట్టూ ఉన్న సమయంలోనే ఈ హాట్ సీన్స్ చేయడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అంటూ  తెలిపింది. తనకు  ఇలాంటివి కొత్త కావడంతో... ఇబ్బందిగా అనిపించినప్పటికీ పాత్ర డిమాండ్ చేయడంతో తప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు చెప్పడంతో  తనని తాను మోటివేట్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: