తిరుపతిలో మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించాలన్న ఉద్దేశ్యంతో జిల్లాలో పర్యటిస్తున్నాను అన్నారు. పంట నష్టంపై ఓ నివేదిక సిద్ధం చేసి సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాము అన్నారు. కౌలు రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేసారు.  ప్రతి రైతుకు తన పంటకు లాభసాటి ధర కావాలి అన్నారు. ఇందుకోసం 'జై కిసాన్' పేరిట ఓ ఉద్యమాన్ని చేపట్టనున్నాము అని చెప్పారు. ప్రతి రైతుకు పంట నష్టం కింద కనీసం 35 వేలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేసారు.

వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం 10 వేలు ఇస్తోంది అన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్నది సరిపోవడం లేదు... మద్యం, ఇసుకలో ప్రభుత్వం ఎంతో గడిస్తోంది... రైతులకు సరిపడా ఇవ్వడం లేదు అన్నారు. రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉంది....రైతుల ఉద్యమాన్ని కేంద్రం పరిష్కరిస్తుందని స్పష్టం చేసారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రజనీకాంత్ రాజకీయల్లోనే ఉన్నారు... ఆయనకు మంచి జరుగుతుందని భావిస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప పోరు విషయంలో బిజెపితో కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారు అని స్పష్టం చేసారు.

వీసీ నియామకాల్లో మెజార్టీ రెడ్లనే వేశారు అని ఆయన అన్నారు. ఒకే కులాన్ని మెజార్టీ యూనివర్శిటీలకు వీసీలుగా నియమించి సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..? అని నిలదీశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పను ద్వారంపూడి దుర్భాషలాడతారా..? అని మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసును ద్వారంపూడి ఇంటికి పంపి క్షమాపణ చెప్పించారు అన్నారు. రైతుల కోసం విరాళాలు ఇస్తారా అని విలేకరులు అందరిని ప్రశ్నించాలి అని ఆయన సూచించారు. 200 కోట్లు పెట్టి రాజ్యసభ సీటు కొనుకున్నవారు, కోట్ల రూపాయల ఎన్నికల్లో ఖర్చు పెట్టే వారిని కూడా అడగాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: