పవర్ స్టార్ పవన్ కల్యాణ్...సినీ రంగంలో తిరుగులేని హీరో....కానీ రాజకీయాలకొచ్చేసరికి పవన్..ఏ మాత్రం సత్తా చాటలేకపోతున్నారనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ప్రశ్నించడం కోసమని చెప్పి జనసేన పార్టీ పెట్టిన పవన్…ఏపీలో 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం జనసేన తరుపున ఒక్క ఎమ్మెల్యే మాత్రమే విజయం సాధించారు. పవన్ పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు.

సరే ఓడిపోతే ఓడిపోయారు. కనీసం 6-7 శాతం ఓట్లు పడ్డాయి. ఇక శాతాన్ని పవన్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆ దిశగా పవన్ పనిచేస్తున్నారా? అంటే ఖచ్చితంగా లేదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికలైపోయి ఏడాదిన్నర దాటేసింది. జగన్ అద్భుతమైన పాలనతో దూసుకెళుతున్నారు. ఇటు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.

కానీ పవన్ మాత్రం సినిమాలు తీసుకుంటూ, అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తూ, పలు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా యాక్టర్లకు అటు సినిమా, ఇటు రాజకీయాన్ని నడిపించడం కుదిరాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అందుకే పవన్‌ని ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇక ఇదొక ఎత్తు అయితే పవన్ ఊహించని విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మరొక డ్యామేజ్ అని విశ్లేషుకులు అంటున్నారు. కేండంలో అధికారంలో ఉన్న బీజేపీతో పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలే ఉన్నా, ఏపీలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం బాగా దెబ్బపడిపోతుందని అంటున్నారు.

కేంద్రలో మంచి పొజిషన్‌లో ఉన్న బీజేపీ ఏపీలో ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీకి ఒక్కశాతం ఓట్లు కూడా లేవు. గత ఎన్నికల్లో నోటా కంటే చాలాతక్కువ ఓట్లు పడ్డాయి. పైగా బీజేపీని ఏపీ ప్రజలు పెద్దగా నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లడం వల్ల జనసేనకు ఉన్న ఓటింగ్ శాతం ఇంకా తగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఇటీవల ఓ సర్వే సంస్థ కూడా అదే తేల్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి  వచ్చిన ఓట్ల శాతం కంటే స్వల్పంగా పెరిగినట్లు చెప్పారు. అది జనసేన ఓటింగ్ అని చెబుతున్నారు. మొత్తానికి పవన్...బీజేపీతో ముందుకెళితే ఇంకా డ్యామేజ్ జరగడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: