రైతు సమస్యలపై పోరాటం అంటూ జిల్లాల పర్యటన చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదాంత ధోరణిలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం గా మారింది. ముఖ్యంగా చిరంజీవి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడడం సంచలనం రేపింది. నిన్న జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు. " చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ చిరు ఎవరి దారి వారిదే అన్నట్లు గా వ్యవహరిస్తున్న తరుణంలో, ఆయన ఈ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.



 ఇదిలా ఉంటే , కార్యకర్తల సమావేశంలో ఎన్నో అంశాలపై తన మనసులో ఉన్న అభిప్రాయాలని పవన్  బయటకు వెళ్లగక్కారు. అధికారం మాకు బాధ్యత, అలంకారం కాదు. అజమాయిషీ చేయడానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం , ఇసుక అమ్ముకోవడం కోసం, మద్యం అమ్ముకోవడానికి నేను సీఎం అవ్వాలి అనుకోలేదు అంటూ పవన్ పరోక్షంగా జగన్ పై సెటైర్స్ వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల వ్యవహారశైలి పైన పవన్ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. 



 ఫోటో తీసుకోనివ్వలేదు అని నాపై కోపం చూపించకండి. మిగిలిన వారు 25 కేజీల బియ్యం ఇవ్వాలని చూస్తుంటే, నేను 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాను.రైతుల కోసం, అమరావతి రైతు కోసం, లాఠీలు విరిగినా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించిన కార్యాచరణ ను ప్రకటిస్తాము అంటూ వ్యాఖ్యానించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: