బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుజనా చౌదరి ఇంటి సభ్యులు తీవ్రమైన దుఃఖంతో కృంగిపోతున్నారు. సుజనా చౌదరి  తండ్రి యలమంచిలి జనార్ధనరావు(88)  అనారోగ్య సమస్య కారణంగా శనివారం కన్నుమూశారు. దాంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖానికి గురయింది. జనార్ధనరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఉదయం 11.45 నిముషాలకు జరిపించపోతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.

యలమంచిలి జనార్ధనరావు... అందరికీ సుపరిచితులే, ఏపీలో ప్రముఖ ఇంజనీర్ గా పేరుగాంచారు జనార్దన్ రావు గారు. ఇంజనీరింగ్ విభాగంలో అద్భుతమైన సేవలు అందించినందుకు జనార్ధనరావు పలు అవార్డులు అందుకున్నారు. కృష్ణా జిల్లా వాస్తవ్యుడైన జనార్ధనరావు ఎంతో కష్టపడి కోయంబత్తూరులోని పిఎస్జీ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. సేవా దృక్పథం ఉన్న వ్యక్తి. ప్రజలకు ఏదో రకంగా నిరంతరం తనవంతు సాయం చేయాలనే భావంతో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టారు. 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరిన ఈయన.... ఏపీలోని పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించారు.

 తన వైపునుండి ప్రత్యేక కృషిని అందించి కొన్ని ప్రాజెక్టులకు మరింత బలాన్ని చేకూర్చారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజి, నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను కీలక బాధ్యతలు నిర్వహించారు. వీటి నిర్మాణం కోసం ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. అప్పట్లో ఏపీ గవర్నమెంట్ ఈయన నైపుణ్యాన్ని గుర్తించి...హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు  చేసే బాధ్యతలను జనార్దన్ రావు కు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ కోసం అప్పట్లో ఈయనను యూరప్  పంపించింది ఏపీ ప్రభుత్వం. ఇలా ఈ ఒక్క ప్రాజెక్టు లోనే కాదు ఎన్నో ప్రముఖ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టి గొప్ప ఇంజనీరింగ్ గా పేరు గాంచారు జనార్దన్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: