ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమక్రమంగా ఎంతో పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సంపాదించేందుకు వివిధ పేద దేశాలను  టార్గెట్గా చేసుకుని వారికి ఆర్థిక సహాయం పేరుతో అన్ని దేశాలు తమ వైపుకు తిప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ఆ స్థానం లోకి వచ్చేందుకు చైనా ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు అనుగుణంగా చైనా చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.



 ఓవైపు ప్రపంచ దేశాల విషయంలో విస్తరణ ధోరణితో వ్యవహరిస్తు వివాదాలు పెట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారిపోయింది చైనా మరోవైపు  వినూత్న ఆవిష్కరణలు కూడా తెరమీదికి తెస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్న విషయం తెలిసిందే ఇప్పటికే ప్రపంచ దేశాలు కని పెట్టకముందే 5జీ టెక్నాలజీ ని కనిపెట్టి అందరినీ ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. అంతే కాకుండా తమ దేశంలో ఉన్న ఎంతో మంది నిపుణులను మరింత పెంచుకుంటూ పోతుంది. అయితే కరోనా వైరస్ కారణంగా 5జి  టెక్నాలజీ వచ్చినప్పటికీ అన్ని దేశాలు పక్కన పెట్టేశారు




 ఇక ఇప్పుడు మరో సరికొత్త ఆవిష్కరణలు తెరమీదికి తెచ్చింది. దీంతో  ప్రపంచం మొత్తం చైనా అద్భుత సృష్టికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అయితే గూగుల్ తయారు చేసినటువంటి సూపర్ కండక్టర్ ఆధారిత క్వాంటం సిస్టమ్  ప్రపంచంలోనే నెంబర్ వన్ కంప్యూటర్ గా గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా ఏకంగా ఈ నెంబర్ వన్ కంప్యూటర్ కి పది రెట్లు మెరుగైనటువంటి సిస్టమ్ ను  కనిపెట్టింది. ఫోటన్  ఆధారిత క్వాంటం సిస్టం ను నిర్మించింది చైనా. ఇప్పుడు వరకు నెంబర్ వన్ స్థానం లో ఉన్నటువంటి సిస్టమ్ కంటే  మరింత మెరుగ్గా పని చేసే టువంటి సిస్టం ఇటీవల చైనా కనుగొంది. అయితే ఇది ఒక అద్భుత సృష్టి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: