తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్ల పై మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ తాజాగా కేంద్రం... తమిళనాడు రాష్ట్రాన్ని సూచించడం సంచలనంగా మారింది. థియేటర్ల పై తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన పూర్తిస్థాయి సడలింపులను అనుమతులను వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ ప్రముఖ నటుడు అరవింద్ స్వామి. కోలివుడ్ సినీ నటుడు విజయ్ మరియు కొందరు సినీ ప్రముఖుల కోరిక మేరకు థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ కి ప్రభుత్వ అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 థియేటర్లలో సీటింగ్ సామర్ధ్యాన్ని 50 శాతం నుండి వంద శాతానికి పెంచాలని... దళపతి విజయ్ తన సినిమా విడుదలకు ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని వ్యక్తిగతంగా కలిశారు. అటు నిర్మాతలు సైతం డిమాండ్ చేస్తుండడంతో... ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు ప్రదర్శించుకోవాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు కరోనా నేపథ్యంలో ఈ ప్రమాదకర ప్రయోగం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు.

కరోనా కష్టకాలం కొనసాగుతున్న సమయంలో ఇటువంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం సరికాదని పలువురు ఖండించారు. తమిళనాడు సినిమా హాళ్లలో 100 శాతం సామర్థ్యానికి వ్యతిరేకంగా అరవింద్ స్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు  సంచలనంగా మారి... వైరల్ అయింది. అరవింద స్వామితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం థియేటర్లలో 100% సీటింగ్ సినిమా ప్రదర్శనకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ నిర్ణయానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు.   కరోనా కష్ట సమయంలో... ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని.... ఇలా వంద శాతానికి సీటింగ్ సామర్థ్యం పెంచడం వల్ల ప్రమాదం మళ్లీ పెరిగే అవకాశం ఉందని  కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టారు.

కరోనా వలన ఎంత నష్టం జరిగిందో చూసాం కదా...మళ్ళీ ప్రజల ప్రాణాలతో ఆటలు సరికాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి ఈ అంశంపై తమినాడు ప్రభుత్వం ..... తాము తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం గా భావించి మౌనంగా ఉన్న వేళ.... కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. థియేటర్ల పై... తాజాగా ఇచ్చిన సడలింపు లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. థియేటర్లలో 100% సీటింగ్ సామర్థ్యంతో సినిమా ప్రదర్శనకు అనుమతించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేంద్ర గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.

కరోనా ఇంకా పూర్తిగా అంతం కాని ఈ సమయంలో.... ఇటువంటి నిర్ణయాలు మరింత ప్రమాదకరం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దీంతో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరోవైపు తమిళనాడు ప్రభుత్వం  థియేటర్లలో  100 శాతం ఆక్యుపెన్సీ కి జీవో జారీ చేయడంతో థియేటర్ ఓనర్స్ - ఎగ్జిబిటర్స్ - ప్రొడ్యూసర్స్ ఆనందంగా ఉండగా... ఇప్పుడు కేంద్రం నుండి వెలువడిన ఈ వార్త... వారి సంతోషాలను ఆవిరి చేసింది. కానీ కరోనా నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: