ఏపీ సీఎం జ‌గ‌న్ దూకుడు మామూలుగా లేద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అధికారం చేప‌ట్టి.. కేవ‌లం ఏడాదిన్న‌రే పూర్త‌యినా.. రెండు మూడు సార్లు వ‌రుస‌గా పాలించిన నాయ‌కుల‌ను మించిపోయిన రీతిలో ఆయ‌న ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ చ‌రిత్ర‌లోనే కాకుండా దేశ చ‌రిత్ర‌లోనేఎన్న‌డూ ఎవ‌రూ అమ‌లు చేయ‌ని విధంగా 30 ల‌క్ష‌ల మంది పేద కుటుంబాల‌కు ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. ఇది భారీ కార్య‌క్ర‌మంగా గిన్నీస్ రికార్డుకు ఎక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌తి నెలా ఏదో ఒక సంక్షేమ కార్య‌క్ర‌మం రూపంలో పేద‌ల బ్యాంకు ఖాతాల్లోకి వేల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం జ‌మ చేస్తోంది.

ఇక‌, పాఠ‌శాల‌ల‌ను న‌వీక‌ర‌ణ‌కు నాడు-నేడు కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తున్నారు. అమ్మ ఒడిని ప్ర‌తిష్టాత్మ‌కం గా తీసుకుని త‌ల్లుల ఖాతాల్లో వ‌రుస‌గా రెండో ఏడాది కూడా నిధులు వేశారు. అదే స‌మ‌యంలో మ‌రీ ముఖ్యంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని మేనేజ్ చేయడంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌క్సెస్ అవుతోంద‌నే భావ‌న క‌నిపిస్తోంది. పోల‌వ‌రం నిధుల మంజూరు విష‌యంలో.. కేంద్రాన్ని ఒప్పించిన జగ‌న్‌.. పాత అంచ‌నాల మేర‌కు నిధులు ఇచ్చేలా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ఇప్పిటి వ‌ర‌కు పేద‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఇప్పుడు మెజారిటీ వ‌ర్గంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తికి కూడా విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం ప్ర‌త్య‌ర్థుల గుండెల్లోరైళ్ల‌ను ప‌రిగెట్టిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఇళ్ల‌స్థ‌లాల‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే విక్ర‌యించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు, ఇదేదో.. ఎప్పుడో ఎన్నిక‌ల‌కు ముందు చేయ‌కుండా.. ఈ ఏడాది వ‌చ్చే నాలుగు మాసాల్లోనే పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించారు.
ఇప్ప‌టికే దీనికి సంబంధించిన విధివిధానాల‌నురూపొందించేందుకు క‌మిటీని వేశారు. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గంలో నెల‌కొన్న ఒక‌విధ‌మైన నైరాశ్యాన్ని తొల‌గించి, ప్ర‌భుత్వానికి సానుకూలం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. ఈ ప‌రిణామాల‌నుగ‌మ‌నిస్తున్న టీడీపీ, బీజేపీ నాయ‌కులు.. నిజంగానే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్ని ప‌థ‌కాలు, ఇంతింత సొమ్ము.. ఇస్తార‌ని తాము ఊహించ‌లేద‌ని, జ‌గ‌న్‌ను చాలా చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం పెద్ద పొర‌పాట‌ని నేత‌లు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వెల్ల‌డిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: