మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిల వివాహ కనీస వయస్సు విషయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స‌జ్జ‌న్ సింగ్ వ‌ర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి....  అమ్మాయిల వివాహ వ‌య‌సుపై  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలు, మ‌హిళ‌ల‌పై నేరాల నియంత్ర‌ణ‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ స‌మ్మాన్ పేరిట అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అమ్మాయిల వివాహ వ‌య‌సును ప్ర‌స్తుతం ఉన్న 18 ఏండ్ల నుంచి 21 ఏండ్ల‌కు పెంచాల‌ని సీఎం అన్నారు.పురుషుల పెళ్లికి కనీస వయస్సు 21 ఏళ్లు. మహిళలు పురుషుల కంటే మూడేళ్ల ముందుగానే పెళ్లి చేసుకోవడానికి చేసుకోవడానికి అనుమతి ఉంది. కానీ అమ్మాయిలు కూడ పెళ్లికి కనీస వయస్సు  21గా ఉండాలని సీఎం వాదించారు....

ఆడపిల్లలు 15 ఏళ్ల వ‌య‌సునుంచే పిల్ల‌ల్ని క‌న‌గ‌లుగుతార‌ని అలాంట‌ప్పుడు వారి  వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకని ప్ర‌శ్నించారు స‌జ్జ‌న్ సింగ్ వ‌ర్మ.ఇది తాను చెబుతున్న మాట కాద‌ని వైద్యుల నివేదిక ప్రకారం 15 ఏళ్ల‌ వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా మార‌తార‌ని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత వారు వివాహం చేసుకోవడానికి తగినంత పరిణతి చెందుతారని అన్నారు. ఈ కార‌ణంగానే ఆడ‌పిల్ల‌ల‌ వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారని ఆయ‌న తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. సజ్జన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అంతేకాదు పార్టీ నుండి ఆయనను బహిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఒక్క మ‌ధ్య‌ప్ర‌దేశ్ అమ్మాయిలనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మాయిల‌ను కించ‌ప‌రిచే విధంగా వ‌ర్మ మాట్లాడార‌ని బీజేపీ నాయ‌కులు ధ్వ‌జ‌మెత్తారు. దేశ మ‌హిళా లోకానికి వ‌ర్మ త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు.ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లు కూడ మహిళలు అనే విషయాన్ని
విషయాన్ని వర్మ మర్చిపోయిఈ వ్యాఖ్యలు చేశారేమోనని రాహుల్ అన్నారు. మహిళలకు వర్మ బహిరంగ .క్షమాపణలు చెప్పాలని  ఆయన సజ్జన్ సింగ్ వర్మను కోరారు. సజ్జన్ ను పార్టీ నుండి బహిష్కరించాలని రాహుల్
సోనియాను కోరారు.సమస్య లేకుండానే సమస్యను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా చెప్పారు....

మరింత సమాచారం తెలుసుకోండి: