సంక్రాంతి పండుగ అనగానే ఏపీలో గుర్తొచ్చేది కోడిపందాలు. ప్రతి సంక్రాంతి సీజన్ లో ఈ కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి ,పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా వంటి ప్రాంతాలలో అడ్డు అదుపు లేకుండా కోడిపందాలు నిర్వహిస్తూ ఉంటారు.ఎన్నో మార్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పందెం రాయుళ్లను పట్టుకున్నప్పటికి కోడిపందాల జోరు మాత్రం ఆగడం లేదు.

వీటితో పాటుగా పలు జూదం ఆటలు కూడా నిర్వహిస్తూ కోట్లలో బెట్టింగులు కాస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కూడా ఏపీలో కోడిపందాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లా పరీవాహక ప్రాంతాలలో జోరుగా కోడి పందాలు, బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. శిబిరాల దగ్గర ప్రత్యేక బందోబస్తును కోడిపందాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకొని మరి అదికారికంగా నిర్వహిస్తున్నారు. దీంతో డబ్బు కోట్లలో చేతులు మారుతుంది. గతంలో తూర్పు కృష్ణా ప్రాంతాలకే పరిమితమైన కోడి పందాల శిబిరాలు.. ఈ ఏడాది పశ్చిమ కృష్ణాలోనూ శిబిరాలు ఏర్పాటు చేశారు.

అధికారులు పలు మార్లు సోదాలు నిర్వహించి, పందెం రాయుళ్లను హెచ్చరించినప్పటికి ఫలితం లేకపోయింది . ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు కావడంతో పోలీసులు కూడా ఏం పట్టనట్టుగా  వ్యవహరించారు. ఒక్క భోగి రోజే రూ.కోట్లలో పందేలు జరగ్గా,నేడు సంక్రాంతి కావడంతో వీటి జోరు మరింత పెరిగింది. మరి కనుమ రోజు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏదిఏమైనా సంక్రాంతి అనగానే కోడిపందాలు కూడా అనే ఆనవాయితీ మరొకసారి రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: