ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిధులు ఎవరు రాబోరని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి ఏడాది కూడా విదేశీ అతిధులు రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశానికి విచ్చేయడం ఆనవాయితీగా మారింది. గత ఏడాది బ్రెజిల్ ప్రసిడెంట్ జైర్ బొల్సినరో ముఖ్య అతిధిగా ఇండియా విచ్చేశారు. అలాగే 2019 లో సౌత్ ఆఫ్రికా ప్రసిడెంట్ క్రీల్ రామఫోసా గణతంత్ర వేదికలకు ఇండియా వచ్చారు. అయితే ఈ ఏడాది ఈ నెల 26 న జరిగే గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలెవరూ ముఖ్య అతిథులుగా రాబోరని కేంద్రం ప్రకటించింది.

ఇందుకు  కారణం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉండడం వల్ల విధేశి నేతలను ఆహ్వానించడం లేదంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఆయా దేశాలలో కోవిడ్ పాండమిక్ ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, అందువల్ల కోవిడ్ నిబందనలను పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 ముందుగా రిపబ్లిక్ డే కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ని చీఫ్ గెస్టుగా ఆహ్వానించారు. ఆయన కూడా ఇందుకు అంగీకరించినప్పటికి, తమ దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ ముప్పు తలెత్తిన దృష్ట్యా ఆయన తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు-ఈ నెల 26 న రిపబ్లిక్ డే నాడు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ఇదివరకే ప్రకటించడంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: