వాహనాల చట్టాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ అటు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాహనదారులకు ఊహించని విధంగా షాక్ ఇస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఎక్కువగా పాతబడిన బైక్ కార్ల విషయంలో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ మీ దగ్గర 15 సంవత్సరాల కంటే పాతబడిన బైకులు కార్లు ఉన్నాయా.. లేదా ఏదైనా సెంటిమెంట్ బైక్ మీ దగ్గర ఉంటే.. వాటిని మాత్రం అస్సలు బయటకు తీసుకురాకపోవడమే మంచిది.  ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కొత్త చట్టం తో ఇకపాత వాహనాలను బయటకు తీసుకు వస్తే అంతే సంగతులు.



 15 ఏళ్ల పైబడిన కార్లు బైకులు అన్నింటినీ కూడా ఇక నుంచి చెత్త  కింద పడేయాల్సిందే.. లేదా ఇనుప సామాన్ల వాడికి అమ్ముకోవాల్సిందే. ఇక ఇటీవల రవాణా  శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని తెలియజేశారు.  15 సంవత్సరాల కంటే పైబడిన వాహనాల ద్వారా పెద్ద ఎత్తున ప్రస్తుతం వాయు కాలుష్యం జరుగుతుంది అన్న విషయాన్ని వెల్లడించారు ఆయన. దీంతో టెక్నాలజీకి అనుగుణంగా రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని. కాలుష్య రహిత మైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.


 మార్కెట్లోకి వస్తున్న కొత్త వాహనాలకు రూట్ క్లియర్ చేసేందుకు అదేవిధంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది అని  కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. ఒకవేళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన  విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు వస్తే ఎంతో మంది వాహనదారులకు భారీ షాక్ తగులుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎంతో మంది 15 సంవత్సరాల పైబడిన వాహనాలు నడుపుతూ ఉండడంతోపాటు.. కొంతమంది కొన్ని వాహనాలను ఎంతో సెంటిమెంట్ తో ఇప్పటికీ కూడా నడుపుతున్నారు అనే విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: