మద్యం రక్కసి ఇప్పటికే ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతో మంది జీవితాలను దుర్భరం చేసింది.  ఎంతోమంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. ఇప్పటివరకు మద్యానికి బానిస గా మారి చివరికి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయిన వారు  కొంతమంది అయితే... మద్యం బారిన పడి చివరికి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం లేదా వివిధ ప్రమాదాలకు గురికావడం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది. మద్యం రక్కసి ఎన్నో కుటుంబాలు తీరని విషాదాన్ని నింపింది. ఇక్కడ పండగపూట విషాదం నిండిపోయింది.



 సంక్రాంతి పండుగసంబరాల్లో  కుటుంబ సభ్యులు మునిగిపోయిన సమయంలో మద్యం రక్కసి ఇక ఊహించని ఘటనతో ఇంట్లో విషాదం నుంపి  పిల్లలను తల్లిదండ్రులు లేని వాళ్ళను  చేసింది. నెల్లూరు జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.. యనమదల లో రోశమ్మ పెంచలయ్య దంపతులు నివసిస్తున్నారు. వీరికి మూడేళ్ల లోపు  వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నార. అయితే ఇటీవలే భోగి పండుగ సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫుల్లుగా మద్యం తాగారు. ఇక రుచికరమైన భోజనాలు వండుకొని తిన్నారు. ఇక మద్యం మత్తులో ఉన్న భార్యాభర్తలు ఇద్దరి మధ్య సెల్ఫోన్ విషయంలో గొడవ జరిగింది.



 ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భార్య రోశమ్మ మృతి చెందింది. అయితే రాత్రికి రాత్రి భార్య మృతదేహాన్ని ఊరి పెద్దల సూచనతో పెంచలయ్య వాగుకు తీసుకువెళ్లి పూడ్చేశాడు. ఆ తర్వాత మద్యం కోడి మాంసం   ఎక్కువై చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అంతేకాదు ఆ తరువాత ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇక తల్లి చనిపోవడం తండ్రి పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ముగ్గురు చిన్నారులు కూడా అనాధలుగా మారిపోయారు.  అప్పుడు వరకు తమతో ఉన్న అమ్మానాన్నలు అంతలో కనిపించకుండా పోవడంతో వారు కూడా తెలియని చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తూ ఉండడం ఎంతో మంది స్థానికులను కంటతడి పెట్టించింది. గ్రామస్తులందరూ ఆ చిన్నారులను ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: