తెలంగాణ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిందే.. రాజకీయంగా బీజేపీ బలపడడం, రాబోయే ఎన్నికలు,  తెరాస పైప్రజల వ్యతిరేకత ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెరాస పార్టీ లో జరుగుతున్న అంతర్మథనం మరొక ఎత్తు.. తెరాస పార్టీ నుంచి భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. దీంట్లో డౌట్ ఏంటి కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ కదా అని మీరనుకోవచ్చు.. అయితే ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత కూడా సీఎం అవ్వాలనే డిమాండ్ వస్తుందట.. సోషల్ మీడియా లో ఈ వార్తలు షికార్లు చేస్తుండగా, ఆమెకు అనూహ్యంగా పార్టీ లో మద్దతు కూడా పెరిగిపోతోందట..

దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం ఇప్పుడు అనుమానంగా ఉంది.. ఈ వార్తలు కేసీఆర్ ఇంట్లో ఇలాంటి కోల్డ్ వార్ జరుగుతోందా అన్న అనుమానానికి దారి తెస్తున్నాయి. కేసీఆర్ కి జాతకాలు అన్నా, పండితులన్నా, విపరీతమైన నమ్మకం అని తెలిసిందే. అయితే వారు చెప్తున్నా భవిష్యవాణి దృష్ట్యా కేటీఆర్ అంటే కవితకి రాజ్యాధికారం ఇస్తే పార్టీ మనుగడ గొప్పగా ఉంటుందట.. దాంతో జాతకాలను నమ్మే చాలామంది నాయకులూ కేటీఆర్ కన్నా ఎక్కువగా కవితావైపే మొగ్గు చూపుతున్నారట.. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

నిజం చెప్పాలంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఐడియా గనుక సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పుడీ ఆలోచన ఎవరికీ వచ్చి ఉండేది కాదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ గా ఉండేవారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ ఏలుతూ ఉండేవారు.. కానీ రాష్ట్రంలో తెరాస ఓడిపోవడం, సెంట్రల్ ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడడం వంటివి చూసి కేసీఆర్ వెనక్కి తగ్గారు.. దెబ్బ తో సీన్ మొత్తం మారిపోయింది.. ఈ నేపథ్యంలో కేటీఆర్ దీనినుంచి ఎలా బయటపడి తన సోదరి దగ్గరినుంచి పదవిని చేజిక్కించుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: