హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ దగ్గర శవాల శివగా పేరొందిన వ్యక్తి సోనుసూద్ ప్రేరణతో ఉదారతను చాటుకున్నాడు. కోవిడ్‌ ప్రభావ సమయంలో బస్సులు, ట్రైన్స్‌, విమానాలతో వలస కార్మికులను వారి గమ్య స్థానాలు చేర్చడంతో పాటు ఎందరో ఆపన్నులకు అండగా నిలబడి రియల్‌ హీరోగా సోనూసూద్‌ మారి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. కేరెక్టర్ ఆర్టిస్టు, విలన్ గా సినిమాలో నటించే సోనుసూద్ సేవా స్వభావానికి ఎంతో మంది ఫిదా అవుతున్నారు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు సోనూసూద్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోనూసూద్‌ చేస్తున్న సేవలను చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారెందరో ఉన్నారు. అందులో కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ తమ షాపులకు సోనూసూద్‌ పేరు పెట్టుకుంటున్నారు. కొంతమంది పుట్టిన బిడ్డలకు సోనుసూద్ పేరు పెట్టుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రానికి చెంది ఓ వ్యక్తి సోనూసూద్‌ కోసం గుడి కూడా కట్టేశాడు.
                                         హుస్సేన్ సాగర్ లో దూకిన ఎంతోమందిని శివ బయటకు తీసాడు. ప్రమాదంలోనూ ఆపదలోనూ ఉన్నవాళ్లను కాపాడేవాడు శివ. కరోనా సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమానాలు, రైళ్లు ఏర్పాటుచేసిన సోనుసూద్ కు శివ ముగ్ధుడయ్యాడు. అప్పటి నుంచి సోనుసూద్ ఫాలోవర్ గా మారాడు శివ. ఈ క్రమంలోనే కొంతమంది ఇచ్చిన విరాళాలతో అంబులెన్స్ ను కొనుగోలు చేశాడు శివ. సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ పేరుతో అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఈ అంబులెన్స్‌ సర్వీసుతో ప్రజలకు సేవలు అందించాలని శివ నిర్ణయించాడు. విషయం తెలుసుకున్న సోనుసూద్ సంతోష పడ్డారు. తన స్ఫూర్తితో ఇతరులకు సేవ చేయడం మంచి కార్యక్రమమని కితాబిచ్చారు. సొనుసూద్ ను అంబులెన్స్ ప్రారంభోత్సవానికి శివ ఆహ్వానించగా.. సోనూసూద్ ఈ సర్వీస్‌ను మంగళవారం లాంచ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: