తెలంగాణా విద్యశాఖ మంత్రి తో ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘాల భేటీ ముగిసింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు నడపాలి అని మంత్రి సబిత ఇంద్రా రెడ్డి స్పష్టం చేసారు. 12అంశాలను పరిష్కరించాలని  మంత్రి సబితా కి  ప్రైవేట్ స్కూల్స్ విజ్ఞప్తి చేసాయి. జీవో 46 ప్రకారం ఫీజుల వసుళ్లకు  మార్గదర్శకాలు ఇవ్వాలి అని ప్రైవేట్ స్కూల్స్ కోరాయి. పాఠశాలలో పనిచేసే టీచర్స్ ని ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలి అని ఆమెకు విజ్ఞప్తి చేసారు. ప్రైవేట్ పాఠశాలల్లో సైతం ప్రభుత్వం సానిటైజేషన్ చేయించాలి అని కోరారు.

1 నుంచి 8 తరగతి వరకు అనుమతి ఇవ్వాలి అన్నారు. అకాడమిక్ ఇయర్ జులై 31 వరకు కొనసాగించాలి అని వెల్లడించారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులు వరకు డైరెక్ట్  ప్రమోట్ చేయొద్దు అని విజ్ఞప్తి చేసారు. పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలి అని కోరారు. ఆఫ్ లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ హాజరు కంపల్సరిగా చేయాలి అని తెలిపారు. మే లో 10 వ తరగతి పరీక్షలు నిర్వహించాలి అన్నారు. పాత బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాలి  అని విజ్ఞప్తి చేసారు.

హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్  నుంచి వెంకట్  మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజు వసూలు చేయకుండా ఎలా కట్టడి చేస్తున్నారు  అని ప్రశ్నించారు. 11 స్కూల్స్ పై ఏ చర్యలు తీసుకున్నారని మంత్రి ని ఆడిగాము  అని అన్నారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు  అన్నారు. శానిటేషన్ ఫీ 2 వేలు కట్టాలని అడుగుతున్నాయి  అని మండిపడ్డారు. పేరెంట్స్ ని ఎలా డిక్లరేషన్ అడుగుతున్నారో విద్యార్థుల కు ఏమన్నా అయితే మాదే బాధ్యత అని స్కూల్ మేనేజ్మెంట్ లు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి  అని సూచించారు. ఒకటో తరగతి నుండి 8 వ తరగతి డిటెన్షన్ చేసే అధికారం ఎవరికి లేదు  అని అన్నారు. పేరెంట్స్ కి ఇష్టముంటే నే పాఠశాలలకు పంపించండి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: