జగన్ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలు చేసిన దాడులు రాష్ట్రంలో ఏ అధికార ప్రభుత్వంపై కూడా చేయలేదని చెప్పాలి.. జగన్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు పెరిగాయని, హిందువులకు రక్షణ లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా టీడీపీ అయితే జగన్ పై మతతత్వ దాడిని మొదలుపెట్టింది. జగన్ వల్ల రాష్ట్రంలో క్రిష్టియన్ సంస్కృతి పెరిగిపోతుందని, రాష్ట్రం మొత్తాన్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేస్తున్నాడని ఆరోపణలు చేస్తుంది. గన్ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా పట్టుబిగిస్తుండటం, విమర్శకులు సైతం జగన్ పాలన భేష్ అంటూ కీర్తించడంతో రాజకీయంగా పతనం అంచున ఉన్న తెలుగుదేశం ఉనికిని కాపాడుకునే ప్రయత్నం గా ఈ విధమైన నీచమైన రాజకీయాన్ని చేసేందుకు పూనుకుంది.

జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులతో ఒకరుగా పేరు తెచ్చుకుంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఎక్కడ తావు ఇవ్వకుండా పరిపాలన చేస్తున్నా ఎక్కడో చిన్న సమస్య ను హైలైట్ చేస్తూ టీడీపీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దేవాలయాలపై జరుగుతున్న దాడిని పూర్తిగా వైసీపీ పై రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రామతీర్థం ఘటన  రాష్ట్రంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదముందని గ్రహించిన ప్రభుత్వం విచారణకై పోలీసులని రంగంలోకి దింపింది.

అయితే ఈ విచారణ జరుగుతున్న సమయంలో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పేరును తెరపైకి తెచ్చి ప్రజలను దృష్టి మరల్చి మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుంది టీడీపీ.. ఆలయాల దాడుల  కేసును చేదిస్తున్న పోలీసులకి వచ్చిన ఫిర్యాదుల మేరకు చాలామంది తో పాటు పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే దీన్ని టీడీపీ వేరేవిధంగా చెప్తుంది.  పాస్టర్ ప్రవీణ్ కు వైసీపి నేతలకు మధ్య సంబందాలు ఉన్నాయని, వారి ప్రోద్బలంతోనే ఆలయాలపై పాస్టర్ ప్రవీణ్ దాడులు చేశాడని ఈ వ్యవహారంపై ఎందుకు పోలీసులు నోరు మెదపడంలేదని ఆరోపిస్తున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ గత చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీతో తనకు సాన్నిహిత్యం ఉన్నట్టు తెలుస్తుంది.కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పై గతంలో 6 కేసులు నమోదవ్వగా తెలుగుదేశం పాలనలో కోర్టు వరకు వెళ్లకుండానే మూడు కేసులు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఎత్తివేసినట్టు , 2కేసుల్లో హైకోర్టులో స్టే తెచ్చుకున్నట్టు ఒక కేసు న్యాయస్థానం తొలగించినట్టు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: