తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం అవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అనే మాట వాస్తవం. వాస్తవానికి చంద్రబాబునాయుడు పార్టీలోని నేతల అందరి అభిప్రాయం తీసుకుంటారని కొంతమంది పదేపదే చెబుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి అనే మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు చాలా మంది నేతల మాట వినడం లేదని కొంత మంది సీనియర్ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ సీనియర్ నేతలు... ఆ పార్టీలో ఉన్న యువ నేతల అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు తెలుసుకోవడం లేదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. వర్ల రామయ్య లేకపోతే యనమల రామకృష్ణుడు లేకపోతే అచ్చెన్నాయుడు సలహాలు, సూచనలు మినహా... పార్టీలో క్షేత్ర స్థాయిలో ప్రజలలో పట్టున్న నేతల మాట చంద్రబాబు నాయుడు వినడం లేదు. వారిలో ఎవరికి కూడా ప్రజల్లో గెలిచిన అనుభవం లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వారి మాట వినడం తో అసలు పార్టీ ఎలా ముందుకు నడుస్తుంది అంటూ కొంతమంది ఆవేదన చేసే పరిస్థితులు ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పుల విషయంలో పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యేల సహకారం కూడా చంద్రబాబునాయుడు తీసుకునే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. పార్టీలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీలు కూడా చాలా వరకు బలమైన ఎంపీలు. అయినా సరే వారి విషయంలో ఆయన ఎలాంటి ముందడుగు వేయడం లేదు. వారికి పార్టీ మీద పట్టు ఉన్నా సరే వారి అభిప్రాయాలను తెలుసుకోకపోవడంతో వారు గెలిచిన ప్రాంతాల్లో కూడా పార్టీకి సానుకూల పరిస్థితి లేదు. పార్టీలో వర్గ విభేదాలను కూడా చంద్రబాబు నాయుడు పరిష్కరించడం లేదని చాలా మంది పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: