కరోనా వైరస్‌ నివారణకు గాను  కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీకి భారత ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే . మొదటి దశ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలైంది. అయితే మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, పారిశుద్ద కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వ్యాక్సిన్ల భద్రత, వాటి సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆలా మాట్లాడడంతో ప్రజలలో లేనిపోని బయలు మొదలైయ్యాయి  అత్యవసర అనుమతులు ఇవ్వడంవల్ల ఆయా వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వీటిపై అనుమానాలు అవసరం లేదని చెబుతోంది. అయినా కూడా ఎక్కడో చిన్న అనుమానం వెంటాడుతోంది .. వ్యాక్సిన్లపై  వ్యాపిస్తున్న పుకార్లు, అపోహలను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు అయన సమాధానాలను తెలిపారు ..

భారత్‌లో మొదటి దశలో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడినవారు, 50ఏళ్ల లోపు ఉండి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రజలలో వ్యాక్సిన్ కి సంబందించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి .. వాటన్నింటికి డాక్టర్ హర్షవర్ధన్ సమాదానాలు తెలిపారు  ..ఇక విషయం లోకి వెళ్తే

అలర్జీలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా
అలర్జీల సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
గర్భిణులు, పాలిచ్చే తల్లులపై వ్యాక్సిన్  ట్రయల్‌ నిర్వహించలేని కారణంగా .  వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని డాక్టర్లు తెలిపారు . అయితే తీవ్రమైన అనారోగ్యాల బారిన పడినవారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వ్యక్తులు కోలుకున్న 4-8 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తరువాత కూడా మాస్క్ ధరించాలా?
మాములుగా  కరోనా  వ్యాక్సిన్ ని ప్రజలకి  రెండు డోసుల్లో ఇస్తారు.మొదటి  డోస్ ఇచ్చిన నెల తర్వాత  తరువాత రెండో  డోస్ ఇస్తారు. సెకండ్ ఎవరైతే రెండో డోసు తీసుకుంటారో  వారి శరీరంలో రెండు వారాల తరువాత యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి.  ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ వారి నుంచి వైరస్ ఇతరులకు  వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న కూడా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

ముందు కరోనావైరస్ సోకినవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
గతంలో వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ కరోనా నుండి పూర్తిగా కోలుకున్న తరువాత, నాలుగు నుంచి ఎనిమిది వారాల అనంతరం వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

వ్యాక్సిన్‌తో దుష్ర్పభావాలు ఉంటాయా?
సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చిన్నపాటి దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంజెక్షన్ చేసిన దగ్గర వాపు, తేలికపాటి జ్వరం, బాడీ పెయిన్స్,  దద్దుర్లు వంటి రియాక్షన్స్ కనిపించవచ్చు. కానీ వీటివల్ల  ప్రమాదం ఏమి ఉండదని వైద్యులు చెబుతున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: