వర్తమన రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు చాలా కీలకంగా మారుతున్నాయి. ఏడేళ్ళ క్రితం పార్టీ పెట్టి ఆవేశపూరితంగా ప్రసంగించిన పవన్ ఈ మధ్యకాలంలో చాలానే నేర్చుకున్నారు. ఆయన రాజకీయంగా రాటుతేలుతున్నారు. ఒక విధంగా పవన్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం రాణించేలాగానే  ఆయన ప్రణాలికలు ఉన్నాయి.

గత  ఏడాదిబీజేపీతో పొత్తు పెట్టుకోవడం అన్నది పవన్ రాజకీయంగా వేసిన అతి పెద్ద అడుగు అని చెప్పుకోవాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ తన అభ్యర్ధులను ఉపసంహరించుకుని మరీ బీజేపీకి పవన్ మద్దతు తెలియచేయడం ద్వారా చాలా దూరదృష్టిలో వ్యవహరించారు అని కూడా భావించాలి. ఇక తిరుపతి ఉప ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ బీజేపీ కి మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కూడా ఆ కోవలోనిదే.

పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే కచ్చితంగా వారికే మద్దతు ఇస్తామని మాట్లాడారు. బీజేపీ తిరుపతి నుంచి పోటీ చేయాలనుకుంటోంది. బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చి ఈ కూటమి కనుక బరిలోకి దిగితే కచ్చితంగా విజయావకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. బీజేపీకి ఉన్న  స్ట్రాంగ్ విల్లింగ్,  బలమైన  క్యాడర్, పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్, నిబద్ధతతో పనిచేసే క్యాడర్ ఇవన్నీ కూడా కలసి తిరుపతి లో కూటమి బొమ్మ సూపర్ హిట్ అయ్యేందుకు సూపర్ చాన్స్ ఉందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్  రైట్ టైమ్ లో రైట్ డెసిషన్ తీసుకున్నారని కూడా అంటున్నారు. ఇది రేపటి రోజున అసెంబ్లీ ఎన్నికల వేళ పవన్ పార్టీ ఎక్కువ సీట్లు తీసుకునేందుకు దీని వల్ల  అవకాశం ఉంటుంది. ఇలా రెండు పార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగితే ఏపీలో రానున్న రోజుల్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏపీ ప్రజలకు కూడా అటు టీడీపీ, ఇటు వైసీపీ తో విసిగిపోతున్న వేళ చక్కని ఆల్టర్నేషన్ గా ఈ కూటమి ఉంటుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: