ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తనకు  సహకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భావించారు. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ గత కొంతకాలంగా తీవ్ర అసహనం గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కావడంలేదు.

కేంద్ర ఎన్నికల సంఘం తరహాలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పీడ్ గా రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా జరుగుతుంది. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసారు. ఉద్యోగ సంఘాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. విమర్శలు చేయడం ద్వారా ఉద్యోగుల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు విధుల్లో పాల్గొనే అవకాశం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

తమ ప్రాణాల మీద గ్యారెంటీ లేదని కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని ఉద్యోగులు స్పష్టంగా చెప్పడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగుల్లో చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉండవచ్చు. వాస్తవానికి ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సంఘాన్ని కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను ఇచ్చా అని... కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల ఆపాలని ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: