ప్రస్తుతం ఆన్లైన్ యుగం నడుస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో  వివిధ యాప్స్  ద్వారా సందేశాలు పంపుకోవడానికి ఇక వీడియో కాల్ ద్వారానే ఒకరినొకరు చూసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.  ఇక అంతే కాదు గంటల తరబడి స్మార్ట్ ఫోన్ లోనే కాలం గడుపుతున్నారు నేటి  రోజుల్లో ప్రతి ఒక్కరు. అయితే ప్రస్తుతం ఎక్కువగా భారతదేశంలో వాడుకలో ఉన్న యాప్ ఏది అంటే అందరూ టక్కున  చెప్పే పేరు  వాట్సాప్ అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు తమ వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తెర మీద వస్తూ  ప్రస్తుతం ఎంతోమంది ఆకర్షిస్తూ దూసుకుపోతుంది వాట్సాప్.



కానీ  ప్రస్తుత రోజుల్లో మాత్రం వాట్సాప్ పరిస్థితి అయోమయం లో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. వాట్సాప్ ఇటీవలే తమ కస్టమర్ల కోసం కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చింది. ఇక ఈ కొత్త ప్రైవసీ పాలసీని ప్రస్తుతం వాట్సాప్ కి కొత్త సమస్యలు  తెచ్చిపెట్టింది. అంతేకాదు పూర్తిగా వాట్సాప్ మూసి వేసుకునే పరిస్థితి కూడా తీసుకొస్తుంది. ఇక వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ద్వారా వినియోగదారుల ప్రైవసీకి ఎంతో బంధం కలిగే అవకాశం ఉందని.. వినియోగదారులకు సంబంధించిన పూర్తి డాటా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది అని ప్రస్తుతం వాదన  వినిపిస్తున్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలో ఎంతో మంది ప్రజలు వాట్సాప్ వాడకాన్ని తగ్గిస్తున్నారు అయితే వాట్సాప్ ప్రైవసీ పాలసీ ద్వారా  కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు ఉగ్రవాదులను వణికిస్తున్నట్లు   తెలుస్తోంది. కొత్త ప్రైవసీ పాలసీ తో ప్రైవసీకి సంబంధించిన అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఎంతో మంది ఉగ్రవాదులకూడా వాట్సాప్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక వాట్సాప్ కి బదులుగా అమెరికా యూరోప్ లాంటి దేశాలు తయారు చేసిన యాప్ వాడుతున్నారట. అయితే ఈ యాప్స్ కనీసంమొబైల్ నెంబర్ కూడా పడకపోవడంతో ఈ యాప్ ని  సేఫ్ అని ఎంతో నమ్ముతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: