ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల నిర్వహణ విషయంలో కమిషనుకున్న ఇబ్బందులేంటీ అనే అంశంపై గవర్నర్ ఆరా తీశారు అని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం.. సుప్రీం కోర్టు సూతనల మేరకు ఎన్నికల నిర్వహణ చేపట్టాలని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. సీఎస్, డీజీపీలు సహకరిస్తున్నారని చెప్పాను అని అన్నారు. సుప్రీం తీర్పు తర్వాత అధికారులు స్పందించిన తీరు సంతోషం అని ఆయన హర్షం వ్యక్తం చేసారు. అధికారులతో నాకెటువంటి ఇబ్బంది లేదు అని స్పష్టం చేసారు.

ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం అని, కనీసం ఇప్పటి నుంచి అయినా లక్ష్మణ రేఖ దాటకుండా ఉంటే బాగుంటుందని గవర్నరుకు చెప్పాను అని ఆయన సూచించారు. అధికార పెద్దలు సంయమనం పాటించాలి అని కోరారు. ఎస్ఈసీపై విమర్శలు చేయకూడదని వివరించాను అని అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు అని పేర్కొన్నారు. ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించాలని తన మాటగా చెప్పాలని గవర్నర్ సీఎస్సుకు చెప్పారు అని అన్నారు.

కానీ విమర్శలు ఆగలేదు అని అన్నారు. నేనెవరి ప్రాపకం కోసమో పని చేస్తున్నానంటూ కామెంట్లు చేయడం సరికాదు అని ఆయన వ్యాఖ్యానించారు. నేను అధికారులపై చర్యలు కోరలేదు.. బదిలీ చేయమనలేదు అని అన్నారు. వీడియో కాన్ఫరెన్సుని గిరిజా శంకర్ నిర్వహించారు అని ఆయన పేర్కొన్నారు. పని తీరు మారితే అభిశంసన ఉత్తర్వులపై పునః  పరిశీలన చేయొచ్చు అని సూచించారు. దుగ్గిరాలలో ఓటు హక్కు కోసం అప్లై చేశాను.. కానీ ఇవ్వలేదు అని అన్నారు. ఈ విషయమై నేను బాధ పడ్డాను కానీ.. ఓటు హక్కు కల్పించని అధికారులని తప్పు పట్టడం లేదు అని అన్నారు. నేను నా ఓటు హక్కు కోసం కలెక్టరుని అడుగుతా.. అప్పటికీ స్పందించకుంటే కోర్టుకెళ్తా అని ఆయన  స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: