ఇక జగన్ సర్కార్ ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలు పేరుమార్చి కొత్త పేరుతో ఇక తామే పథకాన్ని ప్రవేశపెట్టాము అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో బిజెపి మాత్రం అటు జగన్ సర్కారు తీరును ఎండగడుతూ.. జగన్ ప్రవేశపెడుతున్న పథకాలను అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరు అనే విషయాన్ని ప్రజలకు తెలియ జేస్తూ ఉన్నారు. కాగా జగన్ ప్రవేశపెట్టబోయే పథకం విషయంలో మరోసారి తొందరపాటులో మనసులో మాట బయటపెట్టారు.
ఇంటింటికి నల్ల నీరు అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ పథకం కోసం ఒక ప్రత్యేకమైన పేరు కూడా సిద్ధం చేసింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ పథకం వెనుక అసలు సూత్రధారి మాత్రం మోడీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జల్ జీవన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక ప్రతీ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్ల నీరు అందే విధంగా భారీగా నిధులు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పథకంలో భాగంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. కానీ ఇటీవలే ఈ పథకం గురించి ప్రెస్ నోట్ విడుదల చేయడంలో తొందరపడిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక జల్ జీవన్ మిషన్ అనే పేరు ప్రస్తావన రాకుండానే ప్రెస్ నోట్ విడుదల చేయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా తొందరపాటులో తమ పథకమే అని మనసులో మాట బయట పెట్టారు అని విశ్లేషకులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి