ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో తీసుకున్న నిర్ణయంపై అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఇక ఇటీవల ఇదే అంశంపై మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు. రైతులు పై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ విమర్శించారు రేవంత్ రెడ్డి. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.
అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు వ్యతిరేకించి బైకాట్ చేసినప్పటికీ కూడా టిఆర్ఎస్ మాత్రం వ్యతిరేకించలేదు అంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఒకప్పుడు మద్దతు ఇవ్వని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుని వ్యవసాయ చట్టాలకు జై కొడుతున్నారు అంటూ ప్రశ్నించారు. కేసిఆర్ నిజంగా రైతుల మేలు కోరుకుంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఇక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపాలని కేంద్రం ఎన్నో కుట్రలు చేస్తుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి