ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు ఎలా ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఆ పార్టీ చాలా దూకుడుగా అడుగులు వేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడుగుతున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న తప్పులు కాస్త తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు నారా లోకేష్ విషయంలో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.

కానీ కొంతమంది నేతలు ఇబ్బంది పెడుతున్నారు. తనకు నచ్చని నేతల విషయంలో ఆయన దూకుడుగా వెళుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని రోజులుగా కూడా ఉన్న సమస్యలను నారా లోకేష్ పెద్దగా పార్టీలో పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. దీనివలన పార్టీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది. అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఆయన కొన్ని కీలక మార్పులు చేసే దిశ గా అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. కొంతమంది నేతలు నియోజకవర్గాల్లో లేక పోవడంతో వారిని పదవుల నుంచి తప్పించి... వాళ్లకి చెప్పకుండాను తప్పించేందుకు రంగం సిద్ధం చేశారట.

అలాగే మాజీ ఎమ్మెల్యే లను కూడా కొంతమందిని పదవి నుంచి తప్పించడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఒక ఎమ్మెల్యే గారి కి కూడా ఆయన త్వరలోనే షాక్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్యే ఉన్నాసరే నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమించే ఆలోచన చేస్తున్నారట. తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సరే నారా లోకేష్ సైలెంట్ గా ఉన్నంత కాలం ఉండి  ఇప్పుడు ఇలా రాజకీయం చేయడంతో పాటు వైసీపీ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: