తిరుపతి ఉప ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేసే అంశానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి ప్రచారం చేస్తారని వార్తలు వచ్చినా సరే అయితే దీని వెనుక వాస్తవాలు ఏంటనే దానిపై స్పష్టత రాలేదు. చిరంజీవిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసే అవకాశాలున్నాయని తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయ వద్దని జనసేన పార్టీ అధినేతను కోరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది.

దీని వెనుక వాస్తవాలు ఏమిటనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చాలా కథనాలు వచ్చాయి. రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇబ్బంది పడుతుందని ప్రచారం ఉంది. ఒకవేళ తిరుపతి జనసేన పార్టీ పోటీ చేసిన చిరంజీవి ప్రచారం చేసినా సరే కాపు సామాజికవర్గం మొత్తం కూడా చిరంజీవి కి మద్దతు పలికే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఇప్పుడు చిరంజీవి కూడా కాస్త వెనక్కు తగ్గితే మంచిదనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తుండగా స్పష్టంగా అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు మరికొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. చిరంజీవి ద్వారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎవరిని నిలబెడితే బాగుంటుంది ఏంటనే దానిపై బిజెపి ఇప్పుడు కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు చిరంజీవి కూడా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఉంటాయి. అందుకే చిరంజీవి తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయ వద్దని కోరే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: