వెల్లుల్లి తింటే గుండె పోటు ముప్పును తగ్గిస్తుందట. అంతే కాకుండా వెల్లుల్లి ఉత్పత్తి చేసే ఫైబ్రినోలైసిస్ గడ్డకట్టిన రక్తాన్ని కూడా సాధారణ స్థితికి తీసుకు వచ్చే అవకాశం ఉందట. అందుకే డయాబెటిస్ రోగులు తరచుగా వెల్లుల్లి తీసుకోవడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఇలా రక్తాన్ని గడ్డ కట్టడాన్ని నివారణ వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం కూడా తగ్గిపోతుంది. ఇక డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు.
రోజు ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొవ్వు స్థాయి కూడా తగ్గడం వల్ల గుండెపోటు ముప్పు మధుమేహం సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందట. అంతేకాదు వెల్లుల్లి ఔషధ గుణాల వల్ల జలుబు, ఫ్లూ,జ్వరం, అధికరక్తపోటు, గుండెపోటు, మధుమేహం, ప్రయాణాలలో విరేచనాలు.. లాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. పెద్ద పేగు, పురీష నాళం, జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను కూడా నిరోధించడంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర వహిస్తుందని చెబుతున్నారు. అయితే ఉదయం పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి