రాజకీయాలు అంటే నువ్వా.. నేనా అనే పోటీ ఉంటుంది.. వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్లకు, వీళ్ళు అధికారంలో వాళ్ళు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం మామూలే.. వాటి పై అధికారుల తో పాటుగా, ప్రజలు కూడా గుస గుసలు చెప్పుకోవడం చేస్తారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎదురైంది. గతంలో జగన్ మోహన్ రెడ్డి కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలా అయితే చేశారో ఇప్పుడు జగన్ అలానే చేశాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది కదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.


విషయానికొస్తే.. నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం లో దిగారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది అంటూ విమాశ్రయంలోని పోలీసులు ఆయనను బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన బాబు పర్యటన కోసం అన్నీ క్లియరెన్స్ లు ఉన్నాయి. నన్ను బయటకు పోనివ్వండి అంటూ ఎంత చెప్పిన కూడా ఆయన బయటకు పోనివ్వలేదు.చంద్రబాబు నాయుడును ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్య అధికారి ఇతరుల ఫోన్లను పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతున్న తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌లోనే బైఠాయించారు.


అకారణంగా తనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలతో మాట్లాడటానికి వెళతానని చెప్పినా పోలీసులు ఆయనను బయటకు వెళ్లనివ్వలేదు. దీంతో తనకు అనుమతి ఇచ్చే వరకు విమానాశ్రయంలోనే తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.ఎయిర్‌పోర్టులో చంద్రబాబును అడ్డుకోవడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఆనాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎపిసోడ్‌తో అటు వైసీపీ మద్దతుదారులు, ఇటు టీడీపీ మద్దతుదారులు కూడా పోల్చుతుండడం విశేషం. ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు.. తమ నేతను ఇలాగే అడ్డకున్నారు కదా అని వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్షనేతను అడ్డుకుంటే ప్రశ్నించని వాళ్లు ఇప్పుడెలా మాట్లాడతున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి టీడీపీ నుంచి అంతే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా లెక్క సరిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: