2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి ఈరోజుటి వరకు టీడీపీ పతనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్కరిని అడిగినా పూస గుచ్చినట్టు చెబుతారు. దీనితో టీడీపీలో హుషారు తగ్గిపోయింది. ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు సైతం ఊరకుండిపోయారు. ఎవరో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తప్పించి మిగతా నాయకులంతా వారి నియోజకవర్గాల్లో సైలెంటుగా ఉన్నారు. మరి కొందరేమో వైసీపీలోకి వెళ్లారు. అయితే పార్టీని ముందుండి నడిపించాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి సరే సరి. ఏమి చేయాలో అర్ధం కాక కనీసం సొంత రాష్ట్రంలో ఉండలేక తెలంగాణలో వెళ్లి తలదాచుకున్నారు.

కాగా ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా ఉత్సాహపడే పని ఒక్కటి చేశారు చంద్ర బాబు. అదేమిటంటే చిత్తూరు జిల్లాలో ఉద్యమం కోసమని వచ్చిన చంద్రబాబుని ఉద్యమం చేయకూడదని పోలీసులు నిరాకరించారు. దీనితో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయలోనే నేలపై కూర్చుండిపోయారు. పోలీసు వారు ఎంత ప్రయత్నించినా చంద్రబాబు అక్కడి నుండి లేవడానికి ఒప్పుకోలేదు. కనీసం మంచి నీరు, కూల్ డ్రింక్, టీ ఏమీ తగ్డనైకి తినడానికి అంగీకరించలేదు. మొండి పట్టు పట్టి దాదాపు సాయంత్రం వరకు లాగే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తన రాజకీయ జీవితంలో మళ్ళీ మునుపటిలాగా వ్యవహరించిన సందర్భం ఇదని చెప్పవచ్చు.  ఈ వైఖరి చూస్తుంటే అప్ ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీని ఎంతలా అణగదొక్కాలని చూస్తుందో అర్ధం అవుతోంది. ప్రతి ఒక్క సామాన్యునికి చంద్రబాబు పట్ల చూపించిన విధానం ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేసింది.

ఇక చివరికి జాయింట్ కలెక్టర్ స్వయంగా ఎయిర్ పోర్టుకి వచ్చి చంద్రబాబును కలిసి శాంతింపచేసి ఎయిర్ పోర్టు బయటకు వచ్చేలా చేశారు. అక్కడి నుండే చంద్రబాబు టీడీపీ అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా చూస్తే మొట్ట మొదటి సారిగా ప్రభుత్వాన్ని ఎదిరించిన సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. మనము నమ్మింది న్యాయంగా అనిపించినప్పుడు ఎంత దూరమైనా వెళ్లి విజయాన్ని సాధించగలం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ సంఘటన నిలిచిపోతుంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగడానికి ఇది ఒక కలికితురాయి అని చెప్పవచ్చు. ఈ సంఘటనతో ఏపీ ప్రభుత్వానికి పరువు పోయినంత పనయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: