తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బాధ్యతలను స్వీకరించిన రోజు నుంచి ఆయన దగ్గర గటిక విజయ్ కుమార్ ప్రజా సంబంధాల అధికారి గా పని చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విజయ్ కుమార్ కొద్దిసేపటి కిందనే వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. అయితే తను వ్యక్తిగత కారణాల వల్ల ముఖ్యమంత్రి పీఆర్వో హోదా నుంచి తప్పుకోవాలనే తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ట్రాన్స్ కోలో జనరల్ మేనేజర్ హోదాలో పని చేస్తున్నారు. డిప్యుటేషన్ పై ముఖ్యమంత్రి వద్ద పీఆర్వో గా విధుల్లో ఉంటున్నారు. అయితే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ కుమార్ రాజీనామా చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.


తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల నుంచే గటిక విజయ్ కుమార్ ఆయన దగ్గర పని చేస్తున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా విజయ్ కుమార్‌కు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. వేర్వేరు జేఏసీల్లో కీలక పాత్ర పోషించారు. విజయ్ కుమార్ స్వస్థలం నెక్కొండ. ప్రాథమికోన్నత విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. అనంతరం వరంగల్‌‌లోని ఎల్బీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.


ఇదివరకు కేసీఆర్ సాధించిన విజయాలు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని పొందుపరుస్తూ ఓ పుస్తకాన్ని కూడా రాశారాయన. కాగా ఆయన హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, పేషీపై గట్టి పట్టు ఉన్న ఆయన ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్‌గా కూడా రాజీనామా చేయడం రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.



ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ కుమార్ రాజీనామా చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది. విజయ్ కుమార్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించి, ఆ జాబ్ నోటిఫికేషన్ జారీ చేశారనే వాదన, విమర్శలు కూడా వచ్చాయి. ఓ పత్రికలో విజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా కొన్ని అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలు కూడా వచ్చాయి. అయితే ఏడేళ్లుగా సీఎం కార్యాలయంలో పనిచేసిన విజయ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఆయన రాజీనామాకు కారణాలేంటి ? అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: