తెలంగాణలో చాలా మంది నేతల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఏ పార్టీలో ఉన్నా సరే ఇతర పార్టీల నేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది నేతల మధ్య సఖ్యత కోసం కొంతమంది ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి వంటి నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాయి. సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉంటారు. దీనివలన సీఎం కేసీఆర్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు గా కనపడుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరి నేతలతో మంచి సంబంధాలే ఉన్నాసరే కేసీఆర్ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని మచ్చిక చేసుకునే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ఇతర పార్టీల నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన ఎవ్వరినీ కూడా పెద్దగా దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేయరు. ఒక సీఎం కేసీఆర్ ని మినహాయిస్తే అందరితో కూడా ఆయన సన్నిహితంగానే ఉంటారు. మంత్రి కేటీఆర్ విషయంలో కూడా ఆయన జాగ్రత్త గానే ఉంటారు. అలాగే మరో మంత్రి హరీష్ రావుపై కూడా పెద్దగా విమర్శలు చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయరు.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో టీఆర్ఎస్   పార్టీ జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంది. కాబట్టి ఆ పార్టీ ని కట్టడి చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బిజెపిని ఎదుర్కొనే విషయంలో రేవంత్ రెడ్డి సహకారం ఉంటే మంచిది అనే అభిప్రాయాన్ని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: