జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి వార్తల్లో నిలిచారు. సినిమాలకు రాజకీయాలకు పెద్దగా తేడా లేదు అన్నట్లుగా భావిస్తున్నారు. పార్టీ పెట్టింది మొదలు అసలు అతని ఉద్దేశం ఏమిటో తెలియకుండానే ముందుకు సాగుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు కొట్టినట్టుగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు అనేకసార్లు జరిగినా పెద్దగా స్పందించకపోవడం విశేషం. పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.


70ఏళ్ల వయసు దాటినా కూడా చంద్రబాబు నాయుడు అలుపెరగకుండా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బాబు రాజకీయ అభిప్రాయాలను వ్యతిరేకించేవారు కూడా ఆయన ప్రయత్నాలను తప్పు పట్టలేరు. పొలిటికల్ స్పిరిట్ అంటే ఇదీ.. కానీ రాష్రాన్ని సుడిగాలిలా చుట్టేందుకు వయసు.. ఆరోగ్యం సహకరిస్తున్నా  జనసేనాని వపన్ కల్యాణ్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమికి ఓటు వేయాలని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం.దీన్నిబట్టి చూస్తే పవన్ కల్యాణ్ రాజకీయాలను ఎంత సులువుగా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది. ఇంట్లో కూర్చుని ఊరికే మాటలు చెబితే  సమాజంలో మార్పు వస్తుందా..? లక్షలాది పుస్తకాలు చదివానని చెప్పుకునే వపన్ కల్యాణ్ కు ఆ మాత్రం తెలియదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి.


 మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి వైసీపీకి ఓటు వేయవద్దు.వాళ్లు ఇచ్చే నోట్లు ఆశపడి ఓట్లు వేస్తే.. మనల్ని యాచించే స్థాయికి తీసుకెళ్తారని పవన్ కల్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు.పంచాయతీ ఎన్నికల కన్నా పదింత బీభత్సాన్ని మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు సృష్టించారు. వీరిధాటికి కాకలు తీరిన రాజకీయ పార్టీలే కొట్టుకుపోయాయి. జనసేన అభ్యర్థులను బెదిరించినా  వారి దాష్టికాలను ఎదురొడ్డే శక్తి మాకు ఉంది. ఆ యవబలమూ ఎన్నికల్లో ధైర్యంగా నిలబెట్టిందని పవన్ పేర్కొన్నారు. ఒకవైపు ఇదే వీడియోలో అధికార పార్టీ నేతలు తిరగబడుతున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు సమాన్యుడికి భరోసా కల్పించాలంటే వీడియో సందేశాలు సరిపోతాయా..? నేరుగా బాధితుల వద్దకు వెళ్లి భరోసా నింపే ఓపిక పవన్ కు లేదా..? ఇదేనా సమాజంలో మార్పు తీసుకొచ్చే విధానం ఇప్పటికైనా ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టే చర్యలు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: