అధినేత చంద్రబాబునాయుడుకే మాజీ ఎంఎల్ఏ బోండా ఉమా పెద్ద షాకిచ్చారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుగా చివరకు చంద్రబాబుకే బోండా అల్టిమేటమ్ ఇవ్వటం సంచలనంగా మారింది. విజయవాడ నగరంలోని పార్టీ నేతల మధ్య చాలా కాలంగా ఆధిపత్య గొడవలు నడుస్తున్నాయి. నేతలు అంటే అందరు కాదుకానీ ఎంపి కేశినేనికి మాజీ ఎంఎల్ఏలు బోండా ఉమ, నాగూల్ మీరా, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పు లాగ తయారైంది.

పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండే వాళ్ళకి పడదన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ గొడవలు తగ్గిపోతాయని అనుకుంటే అవి కాస్త మరింత పెరిగిపోయి చివరకు రోడ్డున పడ్డాయి. విజయవాడ మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత పేరును చంద్రబాబు ప్రకటించినప్పటి నుండి నివురు గప్పిన నిప్పులాగున్న గొడవలు శనివారం ఉదయం ఒక్కసారిగా బద్దలయ్యింది. మూగ్గురు నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఎంపిని నోటికొచ్చినట్లు చెండాడేశారు. బుద్దా అయితే ఎంపిని చెప్పుతో కొట్టేసేవాడిని అన్న మాటలు సంచలనంగా మారింది.

బోండా మాట్లాడుతూ దమ్ముంటే ఎంపి పదవికి రాజీనామా చేసి ఇండిపెండెండ్ గా పోటీ చేసి గెలవమని విసిరిన సవాలు కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు నాని కూడా పాల్గొంటే తామెవరం పాల్గొనేది లేదని చెప్పేశారు. ఇదే ఫ్లోలో మాట్లాడుతూ పార్టీలో ఎంపి కావాలో లేకపోతే తాము కావాలో తేల్చుకోమని ఏకంగా చంద్రబాబుకే అల్టిమేటమ్ ఇవ్వటం సంచలనమైంది.

ఒకవైపు తామెవరమూ చంద్రబాబు ఆదేశాలను దాటి వ్యవహరించమని చెబుతునే మరోవైపు చంద్రబాబుకే అల్టిమేటమ్ జారీ చేయటాన్ని ఎలా చూడాలో మిగిలిన నేతలకు అర్ధం కావటంలేదు. చివ‌ర‌కు ఆదివారం బాబు క్యాంపెయిన్‌లో ఎంపీ లేరు. ఏదేమైనా బోండా, బుద్ధాల‌కు చంద్ర‌బాబు స‌రెండ‌ర్ అయ్యారన్న గుస‌గుస‌లు పార్టీలోనే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: