అయితే నిజానికి గురక అనేది పెద్ద వ్యాధి ఏం కాదు. శ్వాసించే సమయంలో సహజంగా ఎదురయ్యే సమస్య. నిద్రిస్తోన్న సమయంలో నోరు, ముక్కు ద్వారా గాలి సులభంగా తీసుకోకపోవడం వల్ల గురక వస్తుంది.గురక సమస్యకు సహజంగా చెక్ పెట్టడానికి టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే గురక సమస్యను తగ్గించవచ్చు.
ఇక టీస్పూన్ యాలకుల పొడిని గ్లాసు కాచిన నీటిలో కలిపి పడుకునే ముందు తాగితే గురక తగ్గుతుంది. అటుకులను కాస్త నీటిలో తడిపి పచ్చి అటుకులను రాత్రి వేళలో తింటే గురకను అదుపు చేయొచ్చు. ఇక కొంత మందిలో శ్వాస కోశ సంబంధిత సమస్యల వల్ల కూడా గురక వస్తుంది. అలాంటి వారు రోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో గోరు వెచ్చని పాలలో పసుపు కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
కానీ.. మద్యపానం ఎక్కువగా తీసుకునే వారిలో కూడా గురక సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని తగ్గిస్తే మంచిది. పడుకునే విధానం కూడా గురకకు ఓ కారణమని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పడుకునే విధానంలో ఓ పద్ధతిని పాటిస్తూ.. పిల్లోలు (దిండు) సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా గురకకు చెక్ పెట్టొచ్చు. ఒకవేళ సమస్య ఎంతకీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి