ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే వరుసగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే ఇక ఇటీవలే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక చుట్టూ ఆంధ్ర రాజకీయం తిరుగుతుంది. అయితే నేడు తిరుపతి పార్లమెంటు స్థాన ఉప ఎన్నిక జరిగింది. అందరూ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.



 అయితే మొన్నటి వరకు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేసిన అభ్యర్థులందరిలో ప్రస్తుతం సరికొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అందరూ ప్రస్తుతం ఎంతో భయం భయంతోనే ఎదురుచూస్తున్నారు. ముఖ్యం గా అధికారపార్టీకి ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచింది వైసిపి. ఈసారి  అంతకుమించి మెజారిటీతో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ఎన్నిక  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువుతో కూడుకుని ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కంటే  ఇప్పుడు తక్కువ మెజారిటీ వచ్చినా..  ఓడిపోయిన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉంది.



 అటు అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికార పార్టీకి ఇలాంటి సవాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో తన గెలుస్తామని ధీమాతో ఉన్నప్పటికీ ఊహించని విధంగా బీజేపీ గెలిచింది. ఇక ఆ తర్వాత జి హెచ్ ఎం సి ఎన్నికల్లో కూడా అనుకున్న మెజారిటీ సాధించలేకపోయింది టీఆర్ఎస్. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది...  ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అదే సమయంలో అటు నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ నేత జానారెడ్డి బరిలోకి దిగటం టీఆర్ఎస్ పార్టీకి మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇలా ఈ రెండు ఎన్నికలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పరువు తో కూడుకున్నవే అని చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: