తిరుపతి పార్లమెంటు స్థానంలో వైసిపి పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీ అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నికల గురించి ఎన్నో రోజుల నుంచి ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. అయితే మొదట ఈ ఉప ఎన్నిక జరుగుతుంది అని అనుకున్నప్పటికీ ఇక ముందుగా పంచాయితీ మున్సిపల్ ఎన్నికలు  పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇక ఆ తరువాత తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది.  అయితే ఇక అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి తిరుపతి ఉప ఎన్నికను.



 కాగా తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్  జరిగింది . ఎంతో మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.   తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అటు అధికార పార్టీ ఎక్కడ డబ్బులు పంచ లేదు అని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అయితే ఇక సాధారణంగా ఎన్నికల్లో డబ్బులు పంచుతారు అలాంటిది డబ్బులు పంచకుండా ఉంటుంది అంటే అధికార పార్టీ వ్యూహం ఏంటి అది విశ్లేషకులు కూడా ఆలోచనలో పడ్డారు.


 ఇలాంటి నేపథ్యంలో ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ లో భాగంగా ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ పార్టీలు వెలుగులోకి తెచ్చిన అంశం కాస్త సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో ఎన్నో దొంగ ఓట్లు పడ్డాయి అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక అటు టిడిపి బిజెపి పార్టీ లు అయితే ఏకంగా దీనికి సంబంధించి వీడియోలను కూడా విడుదల చేశారు. పెద్ద ఎత్తున తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లకు వైసీపీ  పాల్పడుతుంది అంటూ అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందించ పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక డబ్బులు పంచకపోవడం వల్ల ఎంతో మంది ఓటు వేసేందుకు నిరాసక్తి చూపారని ఇక అలాంటి వారి ఓట్లను దొంగ ఓట్లు గా వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంది అని అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా వ్యవహరిస్తుందో అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: