కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇక వైరస్ నియంత్రణలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అయితే 130 కోట్ల జనాభా ఉన్నప్పటికీ అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కాని విధంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది.  దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గిపోయింది ఇలాంటి తరుణంలో మరో సారి కరోనా వైరస్ మృతుల సంఖ్య భారీగా పెరిగిపోవడం మాత్రం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.  మునుపటి కంటే ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది.


 దీంతో భారత ప్రజానీకం మొత్తం ప్రస్తుతం మళ్లీ ఆందోళనలో మునిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఒకవైపు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ కూడా ఎక్కడా ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.  అటు ప్రజలందరూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి వైరస్ పంజా విసురుతు ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేస్తోంది.  సామాన్యులు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది  వైరస్.  కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం వైరస్ ను కట్టడి చేయడంలో విఫలం అయింది అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.



 తాజాగా ఇదే విషయంపై మరోసారి కేంద్రం పై విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్. కరోనా వైరస్ పోరాటంలో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని విమర్శించింది. మొత్తం ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఉన్న భారత్ లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం సిగ్గు పడాల్సిన విషయం అంటూ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మోడీ ప్రభుత్వం దేశ అవసరాలను కూడా పక్కన పెట్టి ఇతర దేశాలకి వ్యాక్సిన్ అందిస్తుందని.. ఇతర దేశాలకు అందించడం ఆపి దేశ అవసరాల పై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ వ్యాఖ్యానించింది కాంగ్రెస్. 25 ఏళ్లు దాటిన వారికి తప్పనిసరిగా వ్యాక్సిన్ అందించాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: