ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ రెచ్చిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే ఈ సారి సీరియస్ గా ఉంది పరిస్థితి.. కోవిడ్ పరిస్థితి రాష్ట్రంలో తీవ్రంగా ఉందని.. జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

కరోనా మొదటి వేవ్ ను సమర్ధంగా ఎదుర్కోగలిగామన్న అనిల్ కుమార్ సింఘాల్.. ఎక్కువ కేసులు లేకపోవడంతో కేర్ సెంటర్లను డీనోటిఫై చేశామన్నారు. మళ్ళీ వీటిని మొదటి విడత తరహాలోనే ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించామని వివరించారు. 21 వేల మంది వైద్య సిబ్బంది ని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని కోరామని.. ఆస్పత్రులు, ఔషధాలు, పడకలు ఇలా అన్నిటిని సిద్ధం చేయాలని కోరామని వివరించారు.

ఇక ఏపీలో రెమెడివిర్ ఇంజెక్షన్ లు ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిల్లో 36 వేలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 4 లక్షల ఇంజెక్షన్ లు దశల వారీగా సరఫరా చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా డిజి డ్రగ్స్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. 8 వేల డోసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉన్నాయి. ఆక్సిజన్ సరఫరా 200 ఏపీ నుంచి, చెన్నై, బళ్లారి నుంచి కూడా సరఫరా అవుతోంది. ప్రస్తుతం 320 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఆక్సిజన్ డిమాండ్ , రెమెడీసీవీర్ ఇంజెక్షన్ లు అవసరం లేక పోయినా ఇస్తున్నట్టు గుర్తించిన సర్కారు  దీనిపై జిల్లా కలెక్టర్ లకు కూడా ఆదేశాలు ఇచ్చింది. కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సి ఉందని... మాస్కు ధరించక పోతే 100 రూపాయల జరిమానా వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ లో వృధా కాకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చామని.. రెండో డోసు కూడా 2 లక్షల పై చిలుకు మందికి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీలో పడకలు, ఆక్సిజన్ సరఫరా అంతరాయం లేదని కలెక్టర్ లు చెబుతున్నారు. 19 వేల పడకలు సిద్ధం చేస్తే 11 వేల పడకలు నిండాయి. ఇవాళ్టికీ ఇంకా 8 వేల పడకలు ఖాళీగా ఉన్నాయట.  కోవిడ్ టెస్టు, చికిత్స, కన్సల్టెషన్ తదితరాల కోసం 104 ను యాక్టివేట్ చేశారు. నాలుగు రోజుల నుంచి కాల్స్ సంఖ్య పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: