మొన్న కడపలోని జువారి సిమెంట్ పరిశ్రమని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ఎందుకంటే దీని వల్ల కాలుష్యం బాగా ఎక్కువవుతుందని అది ప్రాణ నష్టమని ప్రభుత్వంతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.కాని ఆ పరిశ్రమని నమ్ముకొని కొన్ని వందలాది కుటుంబాలు బ్రతుకుతున్నాయి.దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు జువారి సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నారు.కాని కొంతమంది పని పాట లేని ప్రజలకు, మన ప్రభుత్వానికి వారి బ్రతుకులు కనిపించవు. కేవలం కాలుష్యం అనే వంక మాత్రమే కనిపిస్తుంది.
ఇక అలాగే నిన్న అమర రాజా పరిశ్రమని కూడా కాలుష్యం కారణంగా మూసి వెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాన్ని నమ్ముకొని ఎంతోమంది ఉద్యోగస్తులు బ్రతుకుతున్నారు.కాని మనోళ్ళకి వారి జీవితాలు కనిపించవు. ఇక అలాగే నేడు వైజాగ్ లోని ఫార్మా ప్లాంట్ లని మూసివేయాలని మళ్ళీ ఆదేశాలు. ఎందుకంటే దాని వల్ల చాలా తాబెళ్ళు చనిపోతున్నాయని వాదన.
నిజానికి ఇలాంటి పరిశ్రమలు అన్ని కూడా ఎక్కడో అడవి ప్రాంతాలలో వూరికి చివరన స్థాపిస్తారు. జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని. కాని జనాలే కావాలని అక్కడే పరిశ్రమలకు దగ్గర్లో ఇల్లులు కట్టుకొని జీవనం సాగిస్తుంటారు. మళ్ళీ పొల్యూషన్ అంటూ కంప్లైంట్ చేస్తారు.
అదే ఇలాంటి కంపెనీలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటే మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా అక్కడికి వెళ్లి పని చెయ్యడానికి ఇష్టపడతారు మన జనాలు. పైగా మన రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు ఎందుకు పెట్టరు అని పనికి మాలిన ఎదురు ప్రశ్నలు వేస్తారు.ఇది ఎంత మాత్రం సబబు అనేది ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఆలోచించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి