దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఇక కరోనా రోగులకు ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక, బెడ్స్ దొరికిన ఆక్సీజన్ అందాకా చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పిట్టలా రాలిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కింగ్‌కోటి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక కింగ్‌ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా భాదితులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్టు సమాచారం.

ఇక అధికారులు మాత్రం ఆక్సిజన్ లేదని రోగులు మొత్తుకుంటున్నా నిర్లక్ష్యంగా వ్వవహరించారని చెబుతున్నారు. రెండు గంటలులగా ఆక్సిజన్ అందక కరోనా భాదితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే ఆక్సిజన్ రవాణా ఆలస్యం అయిందని అందుకే సరైన సమయానికి అందించలేక పోయామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.

ఆక్సిజన్ సరాఫరా హైదరాబాద్‌కు బాగానే ఉన్నా... అధికారుల నిర్లక్ష్యం తో పాటు వారి మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు తెలుస్తోంది. కింగ్‌కోటి ఆసుపత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్ చేరాల్సి ఉండగా సరైనా అడ్రస్ లేకపోవడంతో ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నట్టు చెబుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది, విషయం పోలీసులకు తెలిపారు. దీంతో చోరవ తీసుకున్న పోలీసులు ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఉస్మానియా నుండి కింగ్‌కోటి ఆసుపత్రికి తరలించినట్టుగా చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా మరోవైపు ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా పలు చర్యలు చేపడుతున్నట్టు ఉన్నతాధికారులు సమాచారం ఇస్తున్నప్పటికీ ఈ ఘటన జరగడం దురదృష్టకరమే. అయినా ..ఓ వైపు కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష జరుపుతున్న సమయంలో ఇలాంటీ సంఘటన జరగడంపై  పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు రోజులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులపై సమీక్ష జరిపినా..ఫలితం ఇంతేనా..అధికారులు కేవలం సమీక్షలు పర్యటనల వరకే పరిమితం అవుతున్నారా అనే అనుమానాలు వెలువడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: