భారత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్  అమలు చేస్తున్నాయి. అయితే ఎన్ని కరోనా కేసులు వచ్చిన లాక్ డౌన్ పెట్టాము అని పేర్కొన్న కెసిఆర్ అనూహ్యంగా ఈ రోజు అనూహ్యంగా లాక్ డౌన్ ప్రకటించారు.. రేపు ఉదయం 10 గంటల నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు గా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే హైకోర్టు నుంచి ప్రభుత్వానికి వస్తున్న ప్రెజర్ కారణంగానే ఈ లాక్ డౌన్ విధించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి హైకోర్టు ఎప్పుడో విధించమని పేర్కొంది కానీ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తే చాలని చెబుతూ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది..


 కానీ నైట్ కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గకపోవడంతో ఎందుకు మరిన్ని ఆంక్షలు విధించడం లేదని చాలా రోజులుగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.. అయినా సరే తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం ఇష్టం లేదని అలా పెడితే ఆర్థికంగా మళ్ళీ వెనుక పడతామని పేర్కొన్న కేసీఆర్ అనూహ్యంగా ఇప్పుడు ఈ నిర్ణయం వెలువరించడంతో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తారా లేక నైట్ కర్ఫ్యూ లాగానే అంతా హంబక్కేనా అనే చర్చ జరుగుతోంది. 


ఇక లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు.  పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది. ఇక చూడాలి మరి ఈ లాక్ డౌన్ వలన కరోనా కేసులు తగ్గుతాయో లేదో అనేది.  

మరింత సమాచారం తెలుసుకోండి: