చైనా తీరు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలో చైనా వ్యవహరించే తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది  తమ దేశ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇక అమాయకుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టడానికి అస్సలు వెనకడుగు వేయదు చైనా. ప్రజల ప్రాణాలు విషయంలో ఎప్పుడూ నియంతగా వ్యవహరిస్తూ ఉంటాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.  అయితే ఇక ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చైనాలో అత్యాధునిక టెక్నాలజీ ఉందని ఎప్పుడూ చైనా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది.



 ఈ క్రమంలోనే ఇలా గొప్పలు చెప్పుకుంటూనే చైనా లోని పలు ప్రాంతాలలో గాజు తో కూడిన వంతెనలు కట్టించింది చైనా. అయితే ఇలాంటి వంతెనలు గొప్పతనం తమ దేశానికి సొంతమని ప్రపంచంలో  లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో గాజు వంతెన నిర్మించామని ఈ గాజు వంతెన కారణంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగదు అంటూ ఎన్నో గొప్పలు కూడా చెప్పింది. కానీ చైనా చెప్పినవి అన్నీ కూడా డొల్ల మాటలే అని కొన్ని రోజుల్లోనే నిరూపితమైంది. ఇక ఇటీవల చైనా నిర్మించిన ఒక గాజు వంతెన పగలడం తో ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.



 సాధారణంగా చైనా గొప్పలు చెప్పుకునే గాజు వంతెన  చూడటానికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు  చైనా ఈశాన్య ప్రాంతంలోని వియాన్ పర్వతం దగ్గర  100 మీటర్ల ఎత్తు మూడు వందల ముప్పై అడుగుల పొడవు ఉన్న గాజు వంతెన నిర్మించగా ఇక దీనిపై ఇటీవల ప్రమాదం జరిగింది. ఈ వంతెన సందర్శనకు వచ్చిన ఒక పర్యాటకుడు గాజు పగిలిపోవడంతో చివరికి కిందికి జారి పడిపోయాడు.  కానీ అక్కడే చివరికి వేలాడుతూ ఉండిపోయాడు.  గమనించిన సిబ్బంది వెంటనే ప్రత్యేక రక్షణ దళాలను పిలిపించడంతో ఇక వారు ఎంతో శ్రమించి అతని కాపాడారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది అయితే చైనా నాణ్యతలేని టెక్నాలజీ తోనే గాజు వంతెన నిర్మించి ఉందని అందుకే ఇలాంటి పరిస్థితులు దాపురించాయి అని ప్రస్తుతం అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: