మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక ఇటీవల ఆయన తీసుకున్న ఓ నిర్ణయం యావత్ ప్రపంచాన్నే షాక్ కి గురిచేసింది. అదేనండి ప్రపంచ వ్యాప్తంగా ఈ జంట విడాకుల విషయం చర్చనీయాంశంగా మారింది. .గ్రేట్స్ దంపతుల 27ఏళ్ల వివాహ బంధానికి బీటలు బారటానికి ఓ వ్యక్తే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని 2019లోనే తీసుకున్నదని వెల్లడించారు.

అయితే ఈ జంట ఈ విడాకులు తీసుకోవడానికి అసలు కారణం లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషిగా నిర్ధారణ అయి శిక్ష పడిన వ్యక్తితో బిల్ సన్నిహితంగా మెలగడమే వీరి విడాకులకు కారణమని పేర్కొంది. వీరి సన్నిహిత సంబంధాలను మిలిండా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినా బిల్ వినలేదనీ కథనంలో పేర్కొన్నారు. బిల్ సన్నిహితంగా మెలిగిన ఆ వ్యక్తి మరెవరో కాదు. ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి ఆరోపణలపై 2019లో ఎప్‌స్టీన్ అరెస్ట్ అయ్యాడు. ఇలా నేరారోపణలు గల వ్యక్తితో బిల్ సాన్నిహిత్యం కొనసాగించడం మిలిందాకు నచ్చలేదు. గేట్స్ దంపతుల మధ్య పలుమార్లు ఈ విషయమై చిన్నపాటి ఘర్షణలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా వెలువడిన కథనంలో బిల్ గేట్స్ తన స్నేహితుల దగ్గర తన భార్య గురించి ఈ విధంగా వెల్లడించారు. బిల్‌గేట్స్‌ కూడా తన వ్యక్తిగత విషయాలను తన స్నేహితులతో పంచుకున్నారు. ఆయన, తన భార్య మెలిండాతో విడిపోయిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెళ్లడించక ముందు తన స్నేహితులతో పంచుకున్నారట. తన వైవాహిక జీవితం ప్రేమ రహితంగా మిగిలిపోయిందని, తాము వేర్వేరుగా ఉంటున్నామని వారితో ఆయన చెప్పుకొన్నారట. హవాయ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లోని తన మి త్రులతో బిల్‌గేట్స్‌ మాట్లాడినట్లుగా న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. విడాకుల విషయం ఎక్కడ చెప్పుకొన్నారో.. 27 ఏళ్ల క్రితం ఆ గోల్ఫ్‌కోర్టు సాక్షిగానే ఆమెను బిల్‌ పెళ్లాడటం గమనార్హం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: