ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. మరోవైపు.. కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. వ్యాక్సిన్.. ఇప్పుడు జనం వీటి కోసం ఎగబడుతున్నారు. అటు చూస్తే భారత్ బయోటెక్, సీరం సంస్థల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 కోట్ల డోసులు కూడా  లేదు. అయితే ఈ వ్యాక్సిన్ల అంశంలో కేంద్రం వైఖరిపై జోరుగు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. వ్యాక్సిన్ల సత్వర ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది.

ప్రపంచంలో వాక్సినేషన్ లో 30 కోట్లతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 26 కోట్లతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 18 కోట్లతో 3వ స్థానంలో భారత్ ఉంది. పేరుకు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నా..ఇది మన జనాభాతో పోలిస్తే చాలా తక్కువే. అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలతో.. అక్టోబర్  నాటికి భారత్ మొదటి స్థానానికి వెళ్తుందని కేంద్రం చెబుతోంది. వ్యాక్సినేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ నుంచి మొదలుపెడితే కుగ్రామంలో ఉన్న చివరి రైతు వరకు ఈ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కేంద్రం భరోసా ఇస్తోంది.

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న టీకాలో 50% కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రాష్ట్రాలకు నేరుగా పంపిస్తోంది. వివిధ రాష్ట్రాలు ఫార్మా కంపెనీలు కూడా నేరుగా గ్లోబర్ టెండర్స్ ద్వారా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇక వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో 300 కోట్ల డోస్ లు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం రోడ్ మ్యాప్ రెడీ చేస్తోందట. అంతేకాకుండా డబ్లుహెచ్‌ఓ, ఎఫ్‌డీఐ అనుమతులు ఉన్న వ్యాక్సినేషన్ టెక్నాలజీని 24 గంటల్లో దిగుమతి చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చామంటున్నారు.

వ్యాక్సిన్లతోపాటు ఆక్సిజన్, రెమిడిసివిర్ కొరతపైనా కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే యుద్ధ విమానాల ద్వారా ఇప్పటికే విదేశాల నుంచి ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది. 85 రైళ్లను ప్రత్యేకంగా  ఆక్సిజన్ కోసమే వినియోగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: