కొన్ని కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు అనే విషయం కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ధూళిపాళ్ళ నరేంద్ర విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు ఇవ్వక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నాసరే ఆయనకు ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడటం లేదు.

అంతే కాకుండా జిల్లాలో ఆయనతో సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఎవరు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ఆయనకు మద్దతుగా మాట్లాడటం గానీ ఆయనకు మద్దతుగా నిరసన చేయడానికి కానీ ఎవరూ కూడా ముందుకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో కూడా ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అండగా నిలబడటానికి ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా నాయకులు ఎవరూ కూడా విమర్శలు చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు.

సర్కార్  విషయంలో భయపడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర విషయంలో మాట్లాడితే తమను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనే భావనలో వారు ఉన్నారని అందుకే మాట్లాడటం లేదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆసక్తిని రేపుతున్నాయి. రాజకీయంగాధూళిపాళ్ళదూళిపాళ్ల నరేంద్ర ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థికంగా కూడా చాలా ఎదిగారు అని చెబుతూ ఉంటారు. అయితే ఆయన విషయంలో గుంటూరు జిల్లా నేతలకు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని అందుకే ఏమీ అనడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: